సామాజికంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగ రంగాలలో వెనుకబడిన తరగతులకు ఉపశమనం
కల్గించటం కోసం భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాల మేరకు దేశంలోని
షెడ్యూల్ట్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు హాస్టళ్ళ వసతి
సౌకర్యాలు కల్పిస్తున్నారు. దళిత బలహీన వర్గాలకు అందుతున్న ఈ సౌకర్యాలను
ప్రభుత్వాలు భిక్షలాగా భావిస్తున్నాయి. అందుకే అరకొరగా నిధులు
కేటాయిస్తున్నాయి. ''ఇప్పటికి కల్పిస్తున్న సౌకర్యాలే అధికంగా మరిన్ని
సౌకర్యాల కోసం ఇంకెంత కాలం డిమాండ్ చేస్తారంటూ వచ్చే తలతిక్క ఈసడింపుల్లో
కూడా వాస్తవం ఉందేమోనని అనుకుంటున్నారు కొద్ది మంది హాస్టల్ విద్యార్థులు.
ప్రభుత్వాలు హాస్టళ్ళ పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి,
చిత్తశుద్ధిలేమి పై తప్పుడు ప్రచారాలకు తోడ్పాటునిచ్చే విధంగా వుంటున్నాయి.
భారత రాజ్యాంగం తనకు తనే సంక్షేమ రాజ్యంగా ప్రకటించుకున్నది. 16వ అధికరణ
ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశం ఉండాలి. 39వ అధికరణ (సి) ప్రకారం
సంపద ఒక్క దగ్గరే కేంద్రీకరించకుండా చూడాలి. 46వ అధికారణ ప్రకారం ఎస్సీ,
ఎస్టీ, తదితర బలహీన వర్గాల ఆర్థిక ప్రయోజనాలకు ప్రత్యేక శ్రద్ద వహించాలి -
అంటూ రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నది.ఈ
నిర్దేశాల సారాంశాల ఫలితంగానే హాస్టళ్ళ సౌకర్యం పేద, దళిత, బలహీనవర్గాలకు
అందుతున్నది. ప్రభుత్వాలు రాజ్యాంగ నిర్దేశాలను చిత్తశుద్ధితో అమలు చేయటం
లేదు. హాస్టళ్ళను ఏర్పాటు చేసి నడుపుతున్నా వాటి పట్ల, అందులో చదువుతున్న
విద్యార్థుల పట్ల మమకారం లేకుండా, వారి చదువుల పట్ల అశ్రద్ధ చూపిస్తూ
వస్తున్నాయి. 1990 అనంతరం ప్రారంభమయిన నూతన ఆర్థిక విధానాలు ప్రపంచీకరణ,
సరళీకరణ, ప్రైవేటీకరణ పేరుతో ముందుకు రావటంతోనే ''సంక్షేమ రాజ్యం'' అనే
పదానికి ఎదురు దెబ్బతగిలింది. ప్రభుత్వాలు సంక్షేమం నుండి అతివేగంగా
వెనక్కి తగ్గిపోతుండటంతో అందుకు అనుగుణంగానే వారి చర్చలు ఉంటున్నాయి.
సంక్షేమ హాస్టళ్ళకు ఇచ్చే ప్రాధాన్యం ఎప్పుడూ మాటలకే పరిమితమౌతున్నది. వాటి పటిష్టతకు, నిర్వహణకు జరిపే కేటాయింపుల విషయంలో ప్రభుత్వాలు దళిత, గిరిజనుల కిచ్చే భిక్షలాగా వ్యవహారిస్తున్నాయి. భారత మాజీ రాష్ట్రపతి కె.ఆర్ నారాయణన్ అన్నట్లు ''సమాజంలో కొద్ది మంది శీతల పానీయాలు సేవిస్తుండగా, పెద్దమొత్తంలోని ప్రజానీకం త్రాగునీటికి కూడా నోచుకోవటం లేదు. ఈ సేపూథ్యంలో తరగతులను అవతలి ఒడ్డుకు చేర్చటానికి ప్రత్యేక మార్గాలు అవసరం.'' పై వ్యాఖ్యలు నేటికి కూడా ఈ తరగతులకు అందవలసిన సౌకర్యాల పటిష్టత కోసం తీసుకోవల్సిన చర్యల విషయంలో ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయి. తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా, వైజ్ఞానికంగా వెనుకబడిన తరగతులైన దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు రాష్ట్ర జనాభాలో అత్యధికులైనా నేటికి కూడా మొదటితరం కూడా విద్యను అభ్యసించలేని స్థితిలో వున్నారు. వీరికి విద్యను అందించటం కోసం ఏర్పాటైన యంత్రాంగమే ''హాస్టల్'' వారి దయనీయమైన జీవన స్థితి గతుల నుండి వెసులుబాటు కల్పించి వారికి విద్యను అందించటమే వీటి ఉద్దేశం. కానీ ఆచరణలో ఇవి రోజురోజుకు నిర్వీర్యం అవుతూ పేద దళిత, గిరిజనులను విద్య నుండి దూరం చేస్తున్నాయి. దీనికి కారణం ప్రభుత్వాలకు వాటి పటిష్టత కోసం కృషి చేయాలనే సంకల్పం లేకపోవటమే.
ప్రపంచీకరణ-సంక్షేమహాస్టళ్ళు
1990 అనంతరం ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ రూపంలో ముందుకొచ్చిన ఆర్థిక విధానాలు ప్రభుత్వాలను సంక్షేమం నుండి పక్కకు నెట్టేశాయి. బహుళజాతి కంపెనీలు లాభాలు సంపాదించటానికే ప్రభుత్వాలు శ్రద్ద చూపిస్తున్నాయి. ప్రపంచబ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వాలు సంక్షేమ రంగం నుండి తప్పుకుంటున్నాయి. ఈ విధానాలనే సర్వరోగ నివారణిగా పేర్కొంటున్న పాలకుల ఉద్ధేశపూర్వక నిర్లక్ష్యం ఫలితంగా హాస్టళ్ళు నిర్వీర్యమై, హాస్టల్ విద్యార్థులు తీవ్ర సమస్యల నెదుర్కొంటున్నారు.తెలుగుదేశం పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఉదయం నుండి నిద్రపోయే వరకు సంక్షేమం పాటపాడుతూనే వీరిని సంక్షోభంలోకి నెడుతున్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వాన ప్రపంచబ్యాంక్ అడుగులకు మడుగుల్తొతే ప్రభుత్వంగా తయారయ్యింది. గొర్రెను తినేవాడు పోయి బర్రెను తినేవాడు వచ్చే, అన్న విధంగా కాంగ్రెస్ వ్యవహారశైలి వుంది. రైతు రాజ్యమే తమ ధ్యేయం అంటూ, జలయజ్ఞం అంటూ సంక్షేమ రంగానికి కేటాయించాల్సిన నిధులను మళ్ళించి సంక్షేమం నుండి తప్పుకుంటున్నది. నిధుల కోత, సౌకర్యాల లేమితో హాస్టల్ వ్యవస్థ కుంటుపడుతున్నది. వీటిని రక్షించుకుని, పటిష్ట పరచడం కోసం ఉద్యమించాల్సిన అవసరమున్నది.
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ళ నిర్వహణ కోసం ప్రభుత్వం 1997లో జి.ఓ నెం-126 ను విడుదల చేసింది. హాస్టళ్ళను మరింత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి, నిర్ణయాల అమలులో ఆలస్యం చోటు చేసుకోకుండా, ఏఏ అధికారాలు ఏ అధికారి నిర్వర్తించాలో, ఏ సౌకర్యానికి ఎంత మొత్తం కేటాయించాలో నిర్ధారిస్తూ ఆ జి.ఓలో పొందుపరిచింది. 1997 నాటి ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా ఆ కేటాయింపులు చేశారు. ప్రస్తుత ధరలకు అవి ఏ విధంగాను సరితూగవు అనేది స్పష్టం. కాని ఆనాటికి నిర్దేశించిన కేటాయింపులు కూడా హాస్టళ్ళకు సరిగ్గా చేరటం లేదు. అందుకై ప్రభుత్వం నిధులనూ విడుదల చేయటం లేదు. బడ్జెట్ కేటాయింపులు చేసినా నామమాత్రంగానే నిధులు వెచ్చిస్తున్నారు. అనంతరం వాటిని కూడా ఇతర రంగాలకు కేటాయిస్తూ హాస్టల్ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు.గత ప్రభుత్వం టెక్నాలజీ, ఫ్లైఓవర్ లంటూ నిధులు మళ్ళించగా, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో సంక్షేమరంగం నిధులకు కోత విధించటానికి సిద్ధపడ్డది. నెలవారీగా విడుదల చేయవలసిన నిధులను 3 నెలల నుండి 6 నెలల కాలం పాటు విడుదల చేయకపోవటం వల్ల హాస్టళ్ళ నిర్వహణ దెబ్బతింటున్నది.
శాశ్వత వార్షిక సమీక్షా కమిటీని ఏర్పాటు చేయాలి.
నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల్లోకి ఎగబాకుతున్నాయి. హాస్టళ్ళ నిర్వహణకు అవసరమైన కేటాయింపులు మాత్రం గొర్రెతోక బెత్తెడు అన్న చందంగా అక్కడే ఉంటున్నాయి. ఒక్క విద్యా సంవత్సరంలోనే ధరలు అనేక రెట్లు పెరుగుతున్నాయి. కాని హాస్టల్ విద్యార్థులకు ఇస్తున్న మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు, ఇతర కేటాయింపులు 2008 నాటివే కొనసాగుతున్నాయి. వీటిని పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలనే డిమాండ్ ముందుకొస్తూనే వున్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా హాస్టళ్ళకు జరిపే కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు ఉండటం లేదు. 5 సంవత్సరాల క్రితం ధరలు ఏ రకంగా ఉండేవో వాటి కనుగుణంగా ఆనాటి కేటాయింపులు జరిపారు. ఆ కేటాయింపులే నేటికీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలకు అవి ఏమాత్రం సరిపోక విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వార్డెన్లు / మేట్రెన్‌లు అనేక అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల పోరాటాల ఫలితంగా కేవలం మెస్ చార్జీలు పెంచి చేతులుదులుపుకున్నది. ఆ పెరుగుదల కూడా ఈనాటికీ అమల్లోకి రాలేదు. 25 శాతం పెంచామంటున్నారు ప్రభుత్వం వారు. ఏ ప్రాతిపదికమీద దాన్ని పెంచారో మాత్రం సెలవివ్వటం లేదు. ఈ 5 సం||రాల కాలంలో ధరలు 25 శాతమే పెరిగాయా? కేవలం మెస్ చార్జీలు పెంచటంతో ప్రభుత్వ భాధ్యత తీరిపోయిందా? ఇంకా హాస్టళ్ళకు రావలసిన ఇతర కేటాయింపుల లోటును ఏలా పూడుస్తారు? ప్రభుత్వ చట్టం ప్రకారమే విద్యార్థుల కేటాయింపుల్లో ప్రతి సం|| 10 శాతం పెరుగుదల ఉండాలి. అది ఎక్కడా అమలుకు నోచుకోవటం లేదు. హస్టల్ విద్యార్థులకు చెందవలసిన వసతులను సమీక్షించి ప్రతిపాదనలు చేయటానికి ఒక యంత్రాంగ మంటూ లేదు. దీంతో ప్రభుత్వం పావలా పెంచి, ముప్పావలా ప్రచారం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నది. ఆ పెంపుదల కూడా ఏదో భిక్షం వేస్తున్నట్టుగా ఉంటున్నది. ఇదా సంక్షేమం పట్ల బాధ్యత గల ప్రభుత్వం యొక్క కర్తవ్యం? అసెంబ్లీలో, పార్లమెంట్‌లో గౌరవ సభ్యుల జీత, భత్యాలను వారే పెంచుకుంటారు. ఉద్యోగుల వేతనాల పెరుగుదలకు పి.ఆర్.సి లాంటి శాశ్వత యంత్రాంగాలు వున్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ సభ్యులు విలాసవంతమైన జీవితాలు గడుపుతుంటారు. తమకు సౌకర్యాలను ఇంకా పెంచాలని అందుకోసం ఆందోళనకు దిగటానికి కూడా వెనకాడరు. వీరి వేతనాలు పెంచటానికి కూడా స్థాయి సంఘాలు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో దాదాపు 6444 హాస్టళ్ళలో చదువుతున్న దళిత, బలహీన, గిరిజన విద్యార్థుల అవసరాలు గుర్తించటానికి మాత్రం ఏ యంత్రాంగమూ లేదు. ఫలితంగా విద్యార్థులు పౌష్టికాహార లోపంతో అనేక వ్యాధులకు గురౌతున్నారు. భోజనవసతి కల్పించటం ద్వారా అక్షరాస్యతా శాతాన్ని పెంచటానికి, డ్రాప్‌అవుట్ తగ్గించటానికి, మళ్ళీ బడికి, మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు పరుస్తున్నారు. కాని ఇప్పటికే వసతిగృహాల్లో చదువుకుంటామని వస్తున్న విద్యార్థులను అర్ధాకలితో చంపటం భావ్యం కాదు. హాస్టల్ విద్యార్థులకు కేవలం మెస్‌చార్జీలే కాదు. జి.ఓ-126 ప్రకారం రావలసిన అన్ని సౌకర్యాలు వాటికి కేటాయింపులు కూడా సరిపోయే విధంగా
పెంచాల్సివుంది.ఈ క్రమం ఒక్క సారి జరిగి ఆగిపోయేది కాదు. పెరుగుతున్న ధరలను బట్టి వాటిని సవరించాల్సివుంది. కాస్మోటిక్ చార్జీలు, బట్టల కుట్టుకూలీ, గుడ్డ కొనుగోలు, హాస్టల్ నిర్వహణ, ట్యూషన్ ఫీజులు వీటన్నింటిని మారిన, పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలి. ఈ చర్యలు తీసుకోకుండా హాస్టళ్లను పటిష్ట పరుస్తామని ఎన్ని మాటలు చెప్పినా వృథాయే. ప్రభుత్వం నిర్దేశించే వస్తువులను కొనుగోలు చేయటానికి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కొనుగోలు కమిటీలు ఎలా వున్నాయో అలాగే వార్షిక సమీక్షా కమిటీలను కూడా జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేయాలి.
ఇందులో కొనుగోలు కమిటీ చైర్మన్, పౌర సరఫరాల అధికారి,ఎఎస్‌డబ్య్లుఓ, వార్డెన్, మేట్రన్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలకు ప్రాతినిధ్యం వుండాలి. ఇది ప్రతి సంవత్సరం హాస్టల్‌కు విడుదల అవుతున్న నిధులు, విద్యార్థులకు అందవలసిన సౌకర్యాలు సరిగా అందుతున్నాయా?లేదా? ధరలు ఎంత శాతం పెరిగాయి, వాటికనుగుణంగా మెస్,కాస్మోటిక్ చార్జీలు, ఇతర సౌకర్యాలకు కేటాయింపులు ఎంత శాతం పెంచాలో నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించాలి.
సంక్షేమ గురుకులాలను బలోపేతం చేయాలి.
ప్రభుత్వ చిత్తశుద్ధి లేమి, అవినీతి ఫలితంగా రెసిడెన్షియల్ విద్యాసంస్థలు నీరుగారిపోతున్నాయి. 1997లో వీటి ఆవిర్భావం నాటి యంత్రాంగం ఎలాంటి విస్తృతికీ నోచుకోకపోవటం ఫలితంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న దళిత విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమౌతున్నారు. సరళీకరణ నేపథ్యంలో విద్యారంగం అంగడి సరుకుగా మారి, మార్కెట్ శక్తులకు బానిసగా మారింది. దళిత గిరిజనులకు కొద్దిమేరకైనా నాణ్యమైన విద్య సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల ద్వారా మాత్రమే అందుతున్నది. ఈ సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ఐఐటిల్లో ఎ.ఐ.ఇ.ఇ.ఇ లో సీట్లు పొందారు. ఇలాంటి విద్యాసంస్థలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. వీటిల్లో చోటు చేసుకుంటున్న అవినీతి విద్యార్థుల పట్ల శాపంగా మారుతున్నది. వీటి అభివృద్ధికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.6 జోన్‌లలో ఒక్కొక్క జోన్‌కు సగటున 50 పాఠశాలలు ఉన్నాయి. కాని వీటిని పర్యవేక్షణ చేయటానికి నియమించిన 6 మంది జోనల్ అధికారులు సరిపోవటం లేదు. ఉన్న జోనల్ అధికారులు కూడా ఆయా జోన్ పరిధిలో కాకుండా హైదరాబాద్‌లో ఉండి విధులు నిర్వర్తించటం వల్ల ఫలితం నెరవేరటం లేదు. జోనల్ అధికారులను పెంచాల్సిన అవసరం ఉంది.

No comments:
Post a Comment